ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్
Sakshi Education
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అక్టోబర్ 7న నియమించింది.
ఇప్పటివరకు ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న ట్రెవర్ బేలిస్... ఒప్పందం ముగియడంతో పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో 44 ఏళ్ల సిల్వర్‌వుడ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. కొత్త కోచ్ బాధ్యతలు న్యూజిలాండ్ పర్యటనతో మొదలవుతాయి. ఇంగ్లండ్‌కు చెందిన సిల్వర్‌వుడ్ రెండేళ్లుగా బేలిస్ బృందంలో బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. తన కెరీర్‌లో ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : క్రిస్ సిల్వర్‌వుడ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : క్రిస్ సిల్వర్‌వుడ్
Published date : 09 Oct 2019 06:03PM