Skip to main content

ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్ని విజేతలు తై జు, విక్టర్

పతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)...
Current Affairsమహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు రుుంగ్ (చైనీస్ తైపీ) చాంపియన్‌‌సగా నిలిచారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నిలో భాగంగా బర్మింగ్‌హామ్ మార్చి 15న జరిగిన ఫైనల్స్‌లో అక్సెల్‌సన్ 21-13, 21-14తో ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. అలాగే తై జు రుుంగ్ 21-19, 21-15తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా)పై విజయం సాధించింది.

1999 తర్వాత...
1999లో పీటర్ గేడ్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన తొలి డెన్మార్క్ ప్లేయర్‌గా అక్సెల్‌సన్ గుర్తింపు పొందాడు. సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన అక్సెల్‌సన్, తై జు రుుంగ్‌లకు 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతలు
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్), తై జు రుుంగ్ (చైనీస్ తైపీ)
ఎక్కడ : బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్
Published date : 16 Mar 2020 06:42PM

Photo Stories