Skip to main content

ఇండోనేసియాలో ఐసీఐడీ సదస్సు

ఇండోనేసియాలోని బాలిలో సెప్టెంబర్ 2న అంతర్జాతీయ స్థాయిలో మూడేళ్లకోసారి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) నిర్వహించే సదస్సు ప్రారంభమైంది.
సెప్టెంబర్ 7వరకు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి చీఫ్ ఇంజనీర్లు హమీద్ ఖాన్, శంకర్, నర్సింహ, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు సదస్సుకు హాజరై రాష్ట్రం తీసుకున్న జల సంరక్షణ చర్యలపై మాట్లాడారు. మిషన్ కాకతీయ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో నీటి వినియోగ సామర్థ్యం అంశాలపై పత్రాలు సమర్పించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎక్కడ : బాలి, ఇండోనేసియా
Published date : 06 Sep 2019 05:33PM

Photo Stories