ఇండోనేసియా రాజధాని తరలింపు
Sakshi Education
ఇండోనేసియా రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కలిమంతన్‌కు తరలించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విషయాన్ని ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆగస్టు 16న ఆ దేశ పార్లమెంటుకు తెలిపారు. పార్లమొంటులో జోకో మాట్లాడుతూ... దేశ రాజధానిని కలిమంతన్‌కు తరలించేందుకు పార్లమెంటు అనుమతి కోరుతున్నాను అని అన్నారు. రాజధాని అంటే కేవలం ఓ జాతికున్న గుర్తింపు మాత్రమే కాదు.. అది దేశం సాధించిన ప్రగతికి చిహ్నం కూడా అని పేర్కొన్నారు.
నిర్ణయానికి కారణం..
పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ఇండోనేసియా ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితులే కొనసాగితే, 2050 నాటికి నగరంలోని మూడో వంతు ప్రాంతం సముద్రగర్భంలోకి జారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజధానిని తరలించాలని ఇండోనేసియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోనేసియా రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కలిమంతన్‌కు తరలింపు
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో
ఎందుకు : పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతుండటంతో

Published date : 17 Aug 2019 05:29PM