ఇండోనేషియా కొత్త రాజధానిగా కాళీమంథన్
Sakshi Education
ఇండోనేషియా కొత్త రాజధానిగా బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్‌ను ఎంపికచేసినట్లు ఆ దేశాధ్యక్షుడు జొకో విడోడో ఆగస్టు 27న ప్రకటించారు.
కాళీమంథన్ తూర్పు భాగంలోని అటవీ ప్రాంతంలో 1,80,000 హెక్టార్లలో రాజధానిని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత రాజధాని జకార్తా ప్రతీ సంవత్సరం 25 సెంటీమీటర్ల మేర సముద్ర ముంపునకు గురవుతుండటం, వరదలు, భూకంపాల ముప్పు ఎక్కువ ఉండటంతోపాటు విపరీతమైన వాయు కాలుష్యం, ట్రాఫిక్ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. కొత్త రాజధాని అభివృద్ధికి రూ.2.3లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోనేషియా కొత్త రాజధానిగా కాళీమంథన్
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోనేషియా కొత్త రాజధానిగా కాళీమంథన్
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో
Published date : 28 Aug 2019 05:42PM