ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభం
Sakshi Education
దేశ భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు చేసే, సైబర్‌వేదికగా జరిగే నేరాలపై ప్రజల భాగస్వామ్యంతో నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమౌతోంది.
దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఇంటర్‌నెట్‌లో సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్ట్‌లపై కన్నేసి ఉంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ''ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి)''ని కేంద్ర హోం మత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. ఇందులో వాలంటీర్లుగా పనిచేయాలని భావించేవారు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన...
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 24న ఆమోదముద్ర వేసింది. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పాలన విధించాలన్న పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సిఫారసు మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి అనుమతి తరువాత పుదుచ్చేరి అసెంబ్లీ రద్దవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియS సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : దేశ భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు చేసే, సైబర్‌వేదికగా జరిగే నేరాలపై ప్రజల భాగస్వామ్యంతో నిఘా పెట్టేందుకు

Published date : 25 Feb 2021 06:13PM