ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం.. 2021–22 భారత్ వృద్ధి రేటు?
Sakshi Education
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు=1 శాతం) పెంచింది.
ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ఆర్‌బీఐ వృద్ధి అంచనా 9.5 శాతం కాగా, మిగిలిన పలు సంస్థల అంచనాలు 7.9 శాతం నుంచి 10 శాతం వరకూ ఉన్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22లో భారత్ వృద్ధి రేటు 9.4 శాతంగా నమోదవుతుంది
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా)
ఎందుకు : అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం వేగంగా కోలుకుంటుండంతో...
Published date : 20 Aug 2021 06:32PM