Skip to main content

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు

కరోనా మహమ్మారి కారణంగా సవరించిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక క్యాలెండర్‌లో భారత్‌లో జరగాల్సిన ఇండియా ఓపెన్ సూపర్-500 టోర్నీ, సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్-300 టోర్నీలకు స్థానం లేకుండా పోరుుంది.
Edu news2020 ఏడాదికి ఈ రెండు టోర్నీలను రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ ఆగస్టు 27న ఒక ప్రకటనలో తెలిపింది. పాత షెడ్యూల్ ప్రకారం ఇండియా ఓపెన్ 2020, మార్చిలో జరగాల్సింది. అరుుతే కరోనా కారణంగా ఈ టోర్నీని డిసెంబర్‌కు వారుుదా వేశారు. సయ్యద్ మోదీ ఓపెన్‌ను నవంబర్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ తాజాగా ఈ రెండు టోర్నీలను రద్దు చేశారు.

2020, అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో జరగాల్సిన థామస్ కప్, ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను యధావిధిగా నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఇండియా ఓపెన్ సూపర్-500 టోర్నీ, సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్-300 టోర్నీలు రద్దు
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)
ఎందుకు : కరోనా మహమ్మారి కారణంగా...
Published date : 29 Aug 2020 11:52AM

Photo Stories