Skip to main content

ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో కేటీఆర్

దేశ రాజధాని నగరం ఢిల్లీలో నవంబర్ 26న జరిగిన క్రిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్-2019 సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొన్నారు.
Current Affairsతెలంగాణలో పౌరులకు మౌలికసదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను కేటీఆర్ సదస్సులో వివరించారు. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ఇన్నొవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూషన్ (3-ఐ) విధానం అవలంబిస్తున్నట్లు తెలిపారు.

జౌళి శాఖ మంత్రితో సమావేశం
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో నవంబర్ 26న కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు గ్రాంట్ సహకారం అందించాల్సిందిగా ఇరానీని కేటీఆర్ కోరారు. అలాగే సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేసి దానికి అవసరమైన రూ. 49.84 కోట్లు విడుదల చేయాలని విన్నవించారు.

ఫార్మాసిటీకి సహకరించండి
హైదరాబాద్ ఫార్మా సిటీకి అవసరమైన సహకారం అందించాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. కేంద్ర మంత్రిని కలసిన కేటీఆర్.. ఫార్మా సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన అనుమతిలిచ్చి సహకరించాలని కోరారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్-2019 సదస్సు
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : ఢిల్లీ
Published date : 27 Nov 2019 05:38PM

Photo Stories