Skip to main content

ఇండియా చేతికి ఇజ్రాయెల్‌ డ్రోన్‌గార్డ్‌ వ్యవస్థ?!

దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్‌ఐ–4030 డ్రోన్‌ గార్డ్‌ వ్యవస్థను(సీ–యూఏఎస్‌)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది.
Current Affairs
సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. కొన్ని కోట్ల డాలర్లకు డ్రోన్‌ గార్డ్‌ విక్రయాన్ని పూర్తి చేశామని మాత్రమే జూలై 2న ఐఏఐ ప్రకటించినట్లు డిఫెన్స్‌ వార్తల ప్లాట్‌ఫామ్‌ జానెస్‌ తెలిపింది. ఎప్పటికల్లా సదరు దేశానికి ఈ వ్యవస్థను డెలివరీ చేసేది వెల్లడించలేదు.

సీ–యూఏఎస్‌ పనితీరు ఇలా..
  • ఒకవైపు నుంచి వచ్చే దాడులనే కాకుండా పలువైపుల నుంచి వచ్చే దాడులను సైతం డ్రోన్‌ గార్డ్‌ అడ్డుకోగలదు.
  • ఇందులో షార్ట్, మీడియం, లాంగ్‌ రేంజ్‌ (3, 4.5, 6కిలోమీటర్ల రేంజ్‌)వేరియంట్లుంటాయి. ఇందులో వివిధ విభాగాలుంటాయి. ఒక్కో విభాగంలో సెన్సర్లు ఒక్కో పని నిర్వహిస్తాయి.
  • ఏఈఎస్‌ఏ, మల్టి మిషన్‌ 3డీ ఎక్స్‌ బాండ్‌ రాడార్, కామిన్ట్‌ జామర్, ఈఓ మరియు ఐఆర్‌ సెన్సర్‌ అనే విభాగాలు డ్రోన్‌ గార్డ్‌లో ఉంటాయి.
  • చిన్న, సూక్ష్మ డ్రోన్ల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తుంది.
  • దాడికి వచ్చిన డ్రోన్స్‌ వెనక్కు వెళ్లేలా లేదా క్రాష్‌ అయ్యేలా చేస్తుంది.
  • వచ్చిన డ్రోన్లను అడ్డుకొని వెనక్కు పంపడాన్ని సాఫ్ట్‌ కిల్‌ అని, డీకేడీ(డ్రోన్‌ కిల్‌ డ్రోన్‌) వ్యవస్థను ఉపయోగించి వచ్చిన డ్రోన్లను పేల్చేయడాన్ని హార్డ్‌ కిల్‌ అని అంటారు.
Published date : 05 Jul 2021 05:30PM

Photo Stories