ఇందిరా గాంధీ శాంతి బహుమతిని అందుకున్న ప్రసిద్ధ వ్యాఖ్యాత?
Sakshi Education
బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ వ్యాఖ్యాత డేవిడ్ అటెన్‌బరోకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2019 లభించింది.
ఈ పురస్కారాన్ని సెప్టెంబర్ 7న ఆన్‌లైన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అటెన్‌బరోకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. అర్ధశతాబ్దానికి పైగా డేవిడ్ ప్రకృతి సంపద పరిరక్షణకు అమూల్య మైన సేవలనందించారు. పలు చిత్రాలు, పుస్తకాల ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేశారు. ప్రముఖ నటుడు రిచెర్డ్ అటెన్‌బరోకు సర్ డేవిడ్ అటెన్‌బరో సోదరుడవుతారు. ఇందిర శాంతి బహుమతి విజేతకు రూ.25లక్షలను అందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2019 విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ వ్యాఖ్యాత డేవిడ్ అటెన్‌బరో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2019 విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ వ్యాఖ్యాత డేవిడ్ అటెన్‌బరో
Published date : 08 Sep 2020 05:28PM