Skip to main content

ఇళ్ల ప్రాజెక్టుల కోసం పెట్టుబడి నిధి ఏర్పాటు

నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం నవంబర్ 6న ప్రకటించింది.
నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు ఏఐఎఫ్ సాయపడుతుందనిపేర్కొంది. ఏఐఎఫ్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • మొండి బకాయిలు (ఎన్‌పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఏఐఎఫ్ నిధిని పొందేందుకు అర్హమైనవి.
  • - రూ.25,000 కోట్ల ఏఐఎఫ్ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ అందిస్తాయి.
  • - నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్ రంగాల్లో డిమాండ్ పున రుద్ధరణకు ఏఐఎఫ్ తోడ్పడుతుంది.
  • రెరా రిజిస్ట్రేషన్ ఉండి, సానుకూల నికర విలువ ఉన్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి
Published date : 07 Nov 2019 05:32PM

Photo Stories