Skip to main content

ఇళ్ల ధరల వృద్ధిలో బుడాపెస్ట్‌కు తొలి స్థానం

ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హంగేరీలోని బుడాపెస్ట్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇళ్ల ధరల వృద్ధి 24 శాతంగా ఉంది.
Current Affairs బుడాపెస్ట్ తర్వాత చైనాలోని జియాన్, యూహాన్ నగరాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా 15.9 శాతం, 14.9 శాతం ధరల వృద్ధి ఉంది. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ జనవరి 21న విడుదల చేసిన ‘ఇళ్ల ధరల వృద్ధి నివేదిక’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2019, జూలై -సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించి ఈ నివేదికను రూపొందించారు.

హైదరాబాద్‌కు 14వ స్థానం..
ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. మన దేశం నుంచి టాప్-20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం భాగ్యనగరమే. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9 శాతం వృద్ధి చెందాయి. హైదరాబాద్ తర్వాత 73వ స్థానంలో ఢిల్లీ(3.2 శాతం ధరల వృద్ధి), 94వ స్థానంలో బెంగళూరు (2 శాతం), 108వ స్థానంలో అహ్మదాబాద్(1.1 శాతం) ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇళ్ల ధరల వృద్ధిలో బుడాపెస్ట్‌కు తొలి స్థానం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 22 Jan 2020 06:24PM

Photo Stories