Skip to main content

ఇక దక్షిణ మధ్య రైల్వేలోనూ... ప్రైవేటు రైళ్లు

సాక్షి, హైదరాబాద్: పట్టాలపై ఇక ప్రైవేటు రైళ్లు కూత పెట్టనున్నాయి. ప్రస్తుతం లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో పరుగులు తీస్తున్న తేజస్ ప్రైవేటు రైళ్ల తరహాలోనే దక్షిణ మధ్య రైల్వేలోనూ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
Current Affairsఈ క్రమంలో ముంబై-పుణే-హైదరాబాద్ మార్గంలో హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్-నాగ్‌పూర్, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని మార్గాల్లో ప్రైవేటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 15 కొత్త రైళ్లు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటిలో హైదరాబాద్ మీదుగా వెళ్లేవి కూడా ఉంటాయి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రైల్వే లైన్‌లు, సరుకు రవాణా, రైల్వేల భద్రత, రైళ్ల నిర్వహణ వంటి పరిమితమైన బాధ్యతలు మాత్రమే రైల్వేలకు పరిమితం కానున్నాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
ఇక దక్షిణ మధ్య రైల్వేలోనూ ప్రైవేటు రైళ్లు
ఎక్కడ: హైదరాబాద్
ఎందుకు: దక్షిణ మధ్య రైల్వేలోనూ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రైళ్లను నడిపేందుకు..
Published date : 30 Jan 2020 06:17PM

Photo Stories