ఇద్దరు రచయిత్రులకు బుకర్ ప్రైజ్
Sakshi Education
ఆంగ్ల సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు బుకర్ ప్రైజ్-2019 విజేతల పేర్లను అక్టోబర్ 14న ప్రకటించారు.
లండన్‌లోని గిల్డ్‌హాల్ వేదికగా పీటర్ ఫ్లోరెన్‌స ఆధ్వర్యంలోని న్యాయనిర్ణేతల బృందం విజేతల పేర్లను ప్రకటించింది. కెనడియన్ రచయిత మార్గరెట్ ఎట్‌వుడ్, ఆంగ్లో-నైజీరియన్ రచయిత బెర్నార్‌డైన్ ఎవరిస్టోలకు సంయుక్తంగా బుకర్ ప్రైజ్ లభించింది. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి మహిళగా ఎవరిస్టో గుర్తింపు పొందింది. ఇక ఎట్‌వుడ్‌ను బుకర్ ప్రైజ్ వరించడం ఇది రెండోసారి. ‘ద టెస్టామెంట్’ అనే నవలకుగానూ ఎట్‌వుడ్‌కు, ‘గర్ల్, వుమన్, అదర్’ అనే నవలకుగానూ ఎవరిస్టోకు బుకర్ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డు కింద ఇచ్చే 50 వేల పౌండ్ల నగదును ఇద్దరు సమానంగా పంచుకోనున్నారు. కాగా భారత్‌కు చెందిన సల్మాన్ రష్దీ నవల ‘క్విచోటే’ కూడా బుకర్ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ఆరు నవలల్లో ఒకటిగా నిలిచింది.
కాల్పనిక సాహిత్యానికి ఇచ్చే ఈ అత్యున్నత అవార్డు బుకర్ ప్రైజ్ చరిత్ర(1969లో ప్రారంభమైంది)లో 1992 తర్వాత తొలిసారి ఇద్దరు విజేతలను ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుకర్ ప్రైజ్-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : మార్గరెట్ ఎట్‌వుడ్, బెర్నార్‌డైన్ ఎవరిస్టో
కాల్పనిక సాహిత్యానికి ఇచ్చే ఈ అత్యున్నత అవార్డు బుకర్ ప్రైజ్ చరిత్ర(1969లో ప్రారంభమైంది)లో 1992 తర్వాత తొలిసారి ఇద్దరు విజేతలను ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుకర్ ప్రైజ్-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : మార్గరెట్ ఎట్‌వుడ్, బెర్నార్‌డైన్ ఎవరిస్టో
Published date : 15 Oct 2019 06:35PM