Skip to main content

ఈబీసీ నేస్తం పథకానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం

ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టనుంది.
Edu news

ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23న సమావేశమైన మంత్రివర్గం ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. ఇందుకోసం రూ.670 కోట్లు కేటాయించనున్నారు.


కేబినెట్‌ ఇతర నిర్ణయాలు...
  • సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌కు ఆమోదం. 2021, ఏప్రిల్, 2022 మార్చి 31వ తేదీ వరకూ పథకాల వారీగా అమలు చేసే నెలల ఖరారు.
  • రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు రోడ్లు, భూసమీకరణ పనులకు (సమీకరించిన భూముల్లో పనులు) సంబంధించి రూ.3 వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం.
  • రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీ పర్పస్‌ సెంటర్లు, జనతా బజార్లు, ఫామ్‌ గేటు మౌలిక సదుపాయాల ప్రతిపాదనలకు ఆమోదం
  • ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ యాక్టు -1974 సవరణకు ఆమోదం.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌
ఎందుకు : బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించేందుకు
Published date : 24 Feb 2021 06:17PM

Photo Stories