హునర్ హాట్ ప్రదర్శన ప్రారంభం
Sakshi Education
హైదరాబాద్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘హునర్ హాట్’ప్రదర్శన ప్రారంభమైంది.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ జనవరి 12న ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్వీ మాట్లాడుతూ... పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశమంతటా వర్తిస్తుందని, భారత్‌లో అంతర్భాగమైన రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవని, అన్ని మతాల ప్రజలకు భద్రత ఉంటుందని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హునర్ హాట్ ప్రదర్శన ప్రారంభం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ
ఎక్కడ : హైదరాబాద్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : హునర్ హాట్ ప్రదర్శన ప్రారంభం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ
ఎక్కడ : హైదరాబాద్
మాదిరి ప్రశ్నలు
1. ప్రస్తుతం కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖల బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తున్నారు?
1. హర్ సిమ్రత్ కౌర్ బాదల్
2. స్మృతీ జుబిన్ ఇరానీ
3. రేణుకా సింగ్
4. నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం : 2
Published date : 13 Jan 2020 05:39PM