Skip to main content

హిందీ తప్పనిసరి నిబంధన తొలగింపు

హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలంటూ జాతీయ నూతన విద్యా విధానం-2019(డ్రాఫ్టు)లో పొందుపరిచిన నిబంధనను కేంద్రప్రభుత్వం తొలగించింది.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ జూన్ 3న ఈమేరకు ముసాయిదాలో మార్పులు చేసింది. హిందీయేతర రాష్ట్రాల్లోనూ తృతీయ భాషగా హిందీని విద్యార్థులు అభ్యసించాలన్న ప్రతిపాదనపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో ప్రభుత్వం ఈ నిబంధనను సవరించింది.

ఆరు లేదా ఏడో తరగతి(గ్రేడ్)లో విద్యార్థులు తృతీయ భాషను ఎంచుకోవటం/మార్చుకోవటం చేయవచ్చని తాజాగా పేర్కొంది. తొలి ముసాయిదాలో దేశంలో విద్యార్థులు ఏ రాష్ట్రంలో చదువుతున్నా త్రిభాషా విధానంలో హిందీ, ఇంగ్లిష్ తప్పనిసరిగా కొనసాగాలని ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ సూచించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హిందీ తప్పనిసరి నిబంధన తొలగింపు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : జాతీయ నూతన విద్యా విధానం-2019(డ్రాఫ్టు)లో
ఎందుకు : దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో
Published date : 04 Jun 2019 05:26PM

Photo Stories