హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త చీఫ్ శశిధర్ జగ్‌దీశన్
Sakshi Education
ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం–హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ అండ్ ఎండీ)గా శశిధర్ జగ్‌దీశన్నియమితులయ్యారు.
ఆదిత్యపురి స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త చీఫ్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదముద్ర పడినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆగస్టు 4న తెలిపింది. 2020, అక్టోబర్ 27 నుంచి మూడేళ్లపాటుజగ్‌దీశన్ ఈ బాధ్యతల్లో ఉంటారు.
25 సంవత్సరాలుగా...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో గత 25 సంవత్సరాలుగా జగ్‌దీశన్ వివిధ కీలక బాధ్యతలను నిర్వహించారు. జర్మన్ బ్యాంక్ డాయిష్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1996లో జగ్‌దీశన్హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫైనాన్స్ శాఖలో మేనేజర్‌గా చేరారు. 1999లో ఫైనాన్స్ విభాగం బిజినెస్ హెడ్ అయ్యారు. 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. తరువాత బ్యాంక్ అన్ని విభాగాల అత్యుత్తమ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి ‘చేంజ్ ఏజెంట్’గానియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతలతోపాటు ఫైనాన్స్, మానవ వనరులు, న్యాయ, సెక్రటేరియల్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ సామాజిక బాధ్యతల వంటి కీలక విభాగాలు ఆయన కనుసన్నల్లో ఉన్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న కొద్ది మందిలో 55 సంవత్సరాల జగ్‌దీశన్ ఒకరు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ అండ్ ఎండీ)గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : శశిధర్ జగ్‌దీశన్

Published date : 05 Aug 2020 05:47PM