హెచ్‌ఐసీసీలో ఐయాన్‌కాన్-2019 ప్రారంభం
Sakshi Education
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఐయాన్‌కాన్-2019 సదస్సును భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్టోబర్ 3న ప్రారంభించారు.
నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును బ్రెయిన్ అండ్ స్పైన్ సొసైటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిర్వహిస్తోంది. సదస్సులో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలకు చెందిన న్యూరో ఫిజీషియన్లు ఇతర రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. అలాగే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ వీలియం కరోల్, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ ఖాదీల్కర్, ఐయాన్‌కాన్-2019 నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ మోహన్‌దాస్ హాజరయ్యారు.
సదస్సు సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఆహారపు అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. ఐయాన్‌కాన్ లాంటి సదస్సులు పలు జబ్బులపై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐయాన్‌కాన్-2019 ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్

Published date : 04 Oct 2019 05:36PM