హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత
జస్టిస్ కేశవరావు మృతితో హైకోర్టు, జిల్లాల్లోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్‌కు ఆగస్టు 9న సెలవు ప్రకటించారు. వరంగల్ జిల్లా పెండ్యాల గ్రామంలో 1961 మార్చి 29న జస్టిస్ కేశవరావు జన్మించారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన ఆయన 1986లో బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2010 నుంచి 2016 వరకు సీబీఐ కేసుల్లో వాదనలు వినిపించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2015లో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా, 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
వేద చూడామణి సోమయాజులు కన్నుమూత
నడిచే వేద నిఘంటువు, తెలంగాణ గర్వించదగ్గ విద్వాదాహితాగ్ని మాడుగుల మాణిక్య సోమయాజులు (82) ఆగస్టు 9న శివైక్యం చెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని పట్లూర్ గ్రామానికి చెందిన సోమయాజులు... గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వేద చూడామణి బిరుదు అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : జస్టిస్ పొట్లపల్లి కేశవరావు(60)
ఎక్కడ : యశోద ఆస్పత్రి, సికింద్రాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా...