హైదరాబాద్‌కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం
Sakshi Education
హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఓడీఎఫ్++ (ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ)గుర్తింపును జారీ చేస్తూ స్వచ్ఛభారత్ మిషన్ జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది.
నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆయా వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు గాను ఈ గుర్తింపు దక్కింది. దీంతో దేశంలో ఓడీఎఫ్++ గుర్తింపు పొందిన మూడో మెట్రో నగరంగా హైదరాబాద్ నిలిచింది. తాజాగా చండీగఢ్, ఇండోర్‌లను ఓడీఎఫ్++ నగరాలుగా ప్రకటించారు. మొత్తం 4,041 నగరాలు గుర్తింపునకు దరఖాస్తు చేసుకోగా ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, వికారాబాద్ నగరాలున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత పురస్కారం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : స్వచ్ఛభారత్ మిషన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత పురస్కారం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : స్వచ్ఛభారత్ మిషన్
Published date : 29 Jan 2019 05:30PM