Skip to main content

హైదరాబాద్ లో ఇన్నోవ్యాప్టివ్ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌లో ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం, టెక్నికల్ సర్వీస్ సెంటర్ ప్రారంభమైంది.
సైయింట్ చైర్మన్ బి.వి. మోహన్‌రెడ్డి మార్చి 25న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్నోవ్యాప్టివ్ సంస్థ సహా వ్యవస్థాపకులు, ముఖ్య కార్య నిర్వహణాధికారి సందీప్ రవండే మాట్లాడుతూ... 5 మిలియన్ డాలర్లతో, 150 వర్కింగ్ స్టేషన్లతో ఈ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. అమెరికాలోని హోస్టర్‌లో కేంద్ర కార్యాలయాన్ని కలిగి ఉన్న ఇన్నోవ్యాప్టివ్ సంస్థ 16 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 25
ఎక్కడ : హైదరాబాద్
Published date : 26 Mar 2019 05:47PM

Photo Stories