హైదరాబాద్-కర్ణాటక పేరు మార్పు
Sakshi Education
కర్ణాటకలోని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి కల్యాణ కర్ణాటకగా నామకరణం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు.
హైదరాబాద్- కర్ణాటక విమోచన దినం సందర్భంగా సెప్టెంబర్ 17న కలబురిగిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని బీదర్, బళ్లారి, కలబురిగి, రాయచూర్, యాద్గిర్, కొప్పల్ జిల్లాలు వెనుకబాటుకు గురయ్యాయని, వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెక్రటేరియట్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయిస్తామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కల్యాణ కర్ణాటకగా హైదరాబాద్-కర్ణాటక పేరు మార్పు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప
క్విక్ రివ్యూ :
ఏమిటి : కల్యాణ కర్ణాటకగా హైదరాబాద్-కర్ణాటక పేరు మార్పు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప
Published date : 18 Sep 2019 06:24PM