హైదరాబాద్ ఎఫ్‌సీ నూతన కోచ్‌గా మార్కెజ్
Sakshi Education
స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ ‘ల లీగ’ జట్టు ఎఫ్‌సీ బార్సిలోనా కోసం తమ హెడ్ కోచ్ ఆల్బర్ట్ రోకా (స్పెయిన్)ను విడుదల చేసిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ ఎఫ్‌సీ అతడి స్థానంలో స్పెయిన్‌కే చెందిన మాన్యుయెల్ మార్కెజ్‌ను నియమించింది.
ఈ మేరకు ఆయనతో ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ జట్టు ఆగస్టు 31న తెలిపింది. డిఫెండర్‌గా కెరీర్ మొదలుపెట్టిన మార్కెజ్... 28 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పి కోచ్‌గా మారాడు. అనంతరం ‘ల లీగ’లోని లాస్ పాల్‌మస్‌తో పాటు క్రొయేషియాలోని పలు టాప్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు కోచ్‌గా పని చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్ ఎఫ్‌సీ నూతన కోచ్‌గా మార్కెజ్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : మాన్యుయెల్ మార్కెజ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్ ఎఫ్‌సీ నూతన కోచ్‌గా మార్కెజ్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : మాన్యుయెల్ మార్కెజ్
Published date : 01 Sep 2020 04:43PM