Skip to main content

గుప్కార్ అలయెన్స్ చైర్మన్‌గా ఫరూఖ్

శ్రీనగర్: కశ్మీర్‌లో ఇటీవల ఏర్పడిన ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ)కి చైర్మన్‌గా నేషనల్ కాన్ఫరెన్స్ కి చిందిన ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షురాలిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు.
Current Affairs

ఈ వేదికకు సీపీఎం నేత ఎం.వై.తరీగామీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా పీపుల్స్ కాన్ఫరెన్స్ కు చెందిన సజ్జాద్ గనీ లోనె వ్యవహరిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ కూటమి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం పోరాడుతుందని, ఇది జాతి వ్యతిరేక వేదిక కాదని ఆయన అన్నారు. ఈ కూటమి పాత కశ్మీర్ జెండాని తమ పార్టీ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. ఈ కూటమిలో సీపీఐ కశ్మీర్ నేత ఏఆర్ ట్రుక్రూ చేరారు. కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉంది.

క్విక్ రివ్వూ :
ఏమిటి : పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ చైర్మన్‌గా ఫరూఖ్
ఎవరు : ఫరూఖ్ అబ్దుల్లా
ఎక్కడ : జమ్మూకశ్మీర్
ఎందుకు : జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం...

Published date : 26 Oct 2020 04:30PM

Photo Stories