Skip to main content

గుజరాత్‌లో ఇనుపయుగపు ఆనవాళ్లు

గుజరాత్‌లో దాదాపు మూడువేల ఏళ్లనాటి ఇనుపయుగపు ఆనవాళ్లను ఐఐటీ-ఖరగ్‌పుర్ పరిశోధకులు గుర్తించారు.
Current Affairsప్రస్తుతం కచ్‌ప్రాంతంలో ఉన్న ఉప్పునేలలకు సమీపంలోని కరీంషాహి, విగకోట్ ప్రాంతాల్లో ఇనుపయుగం పరిఢవిల్లినట్లు వారు పేర్కొన్నారు. థార్‌ఎడారి సమీపంలో పాకిస్తాన్ సరిహద్దు సమీప ప్రాంతంలో సుమారు 3000-2500 ఏళ్ల క్రితం జనావాసాలున్నట్లు సాక్ష్యాలు లభించాయన్నారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లు తెలిపారు. ఈ పరిశోధన వివరాలను ఆర్కియలాజికల్ రిసెర్చి ఇన్ ఏషియా జర్నల్ ప్రచురించింది.

ప్రకృతి విపత్తుల కారణంగా సింధూనాగరికత అంతరించిపోయిన తర్వాత ఇనుప యుగం మొదలైంది. గుజరాత్‌లో సంభవించిన ఈ పరిణామాన్ని పురాతత్వశాస్త్రవేత్తలు ‘చీకటియుగం’గా అభివర్ణించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇనుపయుగపు ఆనవాళ్లు గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఐఐటీ-ఖరగ్‌పుర్ పరిశోధకులు
ఎక్కడ : కరీంషాహి, విగకోట్ ప్రాంతాలు, గుజరాత్
Published date : 23 Nov 2019 05:54PM

Photo Stories