గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ఏ నగరంలో ఉంది?
Sakshi Education
గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు ఫిబ్రవరి 7న జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా
వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా తపాలా బిళ్లను విడుదల చేశారు. 1960 ఏడాదిలో గుజరాత్ హైకోర్టును స్థాపించారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ హైకోర్టు ఉంది. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్ నాథ్ ఉన్నారు.
మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు...
- భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు చేపట్టింది.
- దేశంలో 18,000 పైగా కోర్టులు కంప్యూటీకరించబడ్డాయి.
- వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కాన్ఫరెన్సింగ్‌లకు సుప్రీంకోర్టు అనుమతించడంతో దేశంలోని అన్ని కోర్టుల్లో ఆన్‌లైన్ విచారణలు సాధ్యమయ్యాయి.
- డిజిటల్ విభజనను తగ్గించడానికి హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో కూడా ఈ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నాం.
- దేశంలో తొలి లోక్ అదాలత్ గుజరాత్‌లోని జునాగఢలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా
Published date : 08 Feb 2021 06:22PM