Skip to main content

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కన్నుమూత

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కేశూభాయ్‌ పటేల్‌(92) కన్నుమూశారు.
Current Affairs

కోవిడ్‌–19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్‌ అక్టోబర్ 29న గుండెపోటుకు గురై అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1928, జూలై 24న జునాగఢ్‌ జిల్లా విసవదార్‌ పట్టణంలో జన్మించిన కేశూభాయ్‌ 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో ప్రచారక్‌గా చేరారు. జన్ సంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన గుజరాత్‌లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించారు.

గుజరాత్‌ పరివర్తన్ పార్టీ స్థాపన...
ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ చైర్మన్ గా ఉన్న కేశూభాయ్ 1995, 1998–2001 సంవత్సరాల్లో గుజరాత్‌ రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్‌లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర శాసనసభకు 6 పర్యాయాలు ఎన్నికైన కేశూభాయ్ 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్‌ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

క్విక్ రివ్వూ :
ఏమిటి : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేతకన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కేశూభాయ్‌ పటేల్‌(92)
ఎక్కడ : అహ్మదాబాద్‌, గుజరాత్ ఎందుకు :గుండెపోటు కారణంగా
Published date : 30 Oct 2020 05:44PM

Photo Stories