గృహ హింసపై సుప్రీంకోర్టు తీర్పు
Sakshi Education
గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చే తీర్పును అక్టోబర్ 15న సుప్రీంకోర్టు వెలువరించింది.
బాధిత మహిళలకు భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. గృహ హింస(డొమెస్టిక్ వయోలెన్స్- డీవీ) చట్టంలో బాధిత మహిళకు భర్త తరఫు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. డీవీ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు సరైనది కాదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తోసిపుచ్చింది. ఢిల్లీకి చెందిన 76 ఏళ్ల సతీశ్ చందర్ అహూజా వేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకటించింది.
Published date : 19 Oct 2020 12:30PM