Skip to main content

గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఈవోగా రమణారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా ఎస్‌.రమణారెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఆగస్టు 14న జీవో విడుదల చేసింది.
Current Affairs
ఇప్పటివరకు ఈయన సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (నెడ్‌కాప్‌) ఎండీగా ఉన్నారు. అలాగే, సోలార్‌ పవర్‌ కార్పొరేషన్ డిప్యూటీ సీసీఏగా పనిచేస్తున్న వీవీ హనుమంతరావుకు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.

బ్రిటన్ కలిసి వైద్య ఉపకరణాల తయారీ
కరోనా మహమ్మారిపై పోరుకు అవసరమైన వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాల ఉత్పత్తి దిశగా ఆంధ్రప్రదేశ్‌ మరో ముందడుగు వేసింది. విశాఖపట్నం జిల్లాలోని మెడ్‌టెక్‌ జోన్ లో 5.6 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన అత్యవసర వైద్య ఉపకరణాల తయారీకి బ్రిటీష్‌ ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ చేపట్టింది. ఇందుకు సంబంధించి ఏపీ, తెలంగాణ బ్రిటీష్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయ ఆగస్టు 14న ప్రకటన విడుదల చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీజీఈసీఎల్‌ కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా అదనపు బాధ్యతలు
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : ఎస్‌.రమణారెడ్డి
Published date : 15 Aug 2020 05:39PM

Photo Stories