గ్రే లిస్టులోనే పాకిస్తాన్: ఎఫ్‌ఏటీఎఫ్
Sakshi Education
ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఫిబ్రవరి 21న ప్రకటించింది.
2020, జూన్‌లోపు ఎఫ్‌ఏటీఎఫ్ ఆదేశాలను అమలు చేయకపోతే వాణిజ్యపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్‌ను హెచ్చరించింది. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు 27 చర్యలు చేపట్టాలని ఆదేశించినా పాకిస్తాన్ వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని గుర్తు చేసింది.
పాకిస్థాన్ గ్రే లిస్టులో కొనసాగితే ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుంది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 39 సభ్య దేశాలు ఉన్నాయి. గ్రే లిస్ట్ నుంచి తప్పించుకొని, వైట్ లిస్ట్‌కు చేరుకోవడానికి పాక్‌కు 12 దేశాల మద్దతు అవసరం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రే లిస్టులోనే పాకిస్తాన్‌ను కొనసాగిస్తాం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)
ఎందుకు : ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైనందున

Published date : 22 Feb 2020 05:42PM