Skip to main content

గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేబినెట్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?

గోవుల సంరక్షణను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక కేబినెట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Edu news ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 18న ప్రకటించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో పాటుగా హోంమంత్రి నరోత్తమ్ , అటవీ శాఖ మంత్రి విజయ్ షా, వ్యవసాయ శాఖ మంత్రి కమల్, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్ర, పశుసంవర్థక శాఖ మంత్రి ప్రేమ్ ఈ కేబినెట్‌లో ఉంటారు. గోపాష్టమిని పురస్కరించుకొని నవంబర్ 22న కేబినెట్ తొలి భేటి జరగనుంది.

గోవుల సంరక్షణతో పాటు ఆవు పాలతో తయారు చేసిన ఉత్పత్తులు, ఔషధ విలువలు కలిగిన గో మూత్రం, పిడకలు వంటి వాటి మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా ఈ కేబినెట్ పని చేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ప్రత్యేక కేబినెట్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : గోవుల సంరక్షణను ప్రోత్సహించడం కోసం
Published date : 19 Nov 2020 06:42PM

Photo Stories