గోల్డెన్ గర్ల్ బాక్సింగ్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు
Sakshi Education
స్వీడన్‌లోని బోరస్‌లో 2020, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన గోల్డెన్ గర్ల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా బాక్సర్లు ఆరు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 14 పతకాలను సాధించారు.
ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. జూనియర్ విభాగంలో ఐదు పసిడి పతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించగా... యూత్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
ప్రాచీకి బెస్ట్ బాక్సర్ అవార్డు
జూనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రాచీ (50 కేజీలు) ‘బెస్ట్ బాక్సర్’ అవార్డును కై వసం చేసుకుంది. ఆమెతో పాటు నివేదిత (48 కేజీలు), ఎథోయ్‌బి చాను వాంజమ్ (54 కేజీలు), లశు యాదవ్ (66 కేజీలు), మహి (80 కేజీలు) బంగారు పతకాలను గెల్చుకోగా... యూత్ విభాగంలో ముస్కాన్ (54 కేజీలు) స్వర్ణాన్ని సాధించింది. జూనియర్ విభాగంలో జాన్వీ (46 కేజీలు), రూడీ లాల్‌మింగ్ మువాని (66 కేజీలు), తనిష్కా (80 కేజీలు) రజతాలు... దియా(60 కేజీలు) కాంస్యం సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోల్డెన్ గర్ల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : ప్రాచీ, నివేదిత, చాను వాంజమ్, లశు యాదవ్, మహి, ముస్కాన్
ఎక్కడ : బోరస్, స్వీడన్

Published date : 05 Feb 2020 05:47PM