గోగ్రా వద్ద ఇండో, చైనా బలగాల ఉపసంహరణ
Sakshi Education
దాదాపు 15నెలల ఉద్రిక్తతల అనంతరం తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా వద్ద ఇండియా, చైనాలు తమతమ బలగాల ఉపసంహరణను పూర్తి చేశాయి.
దీంతో ఈ ప్రాంతంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారేందుకు, శాంతి నెలకొనేందుకు వీలు కలగనుంది. ఈ ప్రాంతంలో బలగాల ఉపసంహరణ ఆగస్టు 4,5 తేదీల్లో పూర్తయిందని, అంతేకాకుండా ఇరుపక్కలా నిర్మించిన తాత్కాలిక కట్టడాలను, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడం జరిగిందని భారత ఆర్మీ ఆగస్టు 6న ప్రకటించింది.
ఒప్పందానికి అనుగుణంగా...
పాంగాంగ్ సరస్సుకు ఇరుపక్కలా బలగాలను, ఆయుధాలను ఇండియా, చైనా ఉపసంహరించుకున్న ఐదునెలల అనంతరం గోగ్రా ఏరియా(పెట్రోలింగ్ పాయింట్ 17ఏ– పీపీ 17ఏ) వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. ఇరు దేశాల మిలటరీ అధికారుల నడుమ జరిగిన 12వ దఫా చర్చల్లో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ఈ ఉపసంహరణ జరిగింది.
బంధానికి వివాద పరిష్కారమే మార్గం...
2020, మే నెలలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలతో ఉద్రికత్తలు ఆరంభమయ్యాయి. గోగ్రా ఏరియాలో శాంతి నెలకొనడంతో ఇకపై హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, డెమ్‌చాక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరగాల్సి ఉంది. ఇరు దేశాల బంధానికి ఈ ప్రాంతాల్లో వివాద పరిష్కారమే మార్గమని భారత్ చెబుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైనిక బలగాల ఉపసంహరణ
ఎప్పుడు : ఆగస్టు 4, 5
ఎవరు : భారత్, చైనా
ఎక్కడ : గోగ్రా ప్రాంతం, తూర్పు లద్దాఖ్
ఎందుకు : గోగ్రా ప్రాంతంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారేందుకు, శాంతి నెలకొనేందుకు...

Published date : 07 Aug 2021 05:39PM