గోదావరి డెల్టాలో ఐదు క్షీరదాలు గుర్తింపు
Sakshi Education
తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం, ఇతర గోదావరి డెల్టా ప్రాంతంలోని మడ అడవుల్లో 115 నీటి పిల్లులను మరో ఐదు రకాల క్షీరదాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు.
ఈ మేరకు ఏప్రిల్ 22న ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ వన్యమృగ సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోదావరి డెల్టా మడ అడవుల్లో నీటి పిల్లులు, ఇతర క్షీరదాలపై చేపట్టిన పరిశోధన పత్రాన్ని ఆయన విడుదల చేశారు. కార్తికేయమిశ్రా మాట్లాడుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా గోదావరి డెల్టాలోని మడ అడవుల్లో క్షీరదాలపై పరిశోధన జరిగిందన్నారు.
2018 జూన్, జులై, ఆగస్టు నెలల్లో కోరింగ వన్య మృగ సంరక్షణ ప్రాంతం, ఇతర మడ అడవుల్లో ఈ పరిశోధనను చేపట్టారు. పరిశోధనలో 115 నీటి పిల్లులతోపాటు ఇండియన్ గోల్డెన్ జాకాల్, ర్విసెస్, మాకాక్యూ, స్మూత్ కోటెడ్ ఓటర్, జంగిల్ క్యాట్, మంగూస్ వంటి క్షీరదాలను గుర్తించారు. వీటిలో గుర్తించిన జాకల్ (నక్క) సంతతి సాధారణంగా మెట్ట ప్రాంతంలో ఉంటుందని, ఇవి తీర ప్రాంతంలోనూ సంచరిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని కలెక్టర్ వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోదావరి డెల్టాలో ఐదు క్షీరదాలు గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ఏపీ అటవీశాఖ వన్యమృగ సంరక్షణ విభాగం
ఎక్కడ : తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

Published date : 23 Apr 2019 06:09PM