గల్వాన్ ఘర్షణలు డ్రాగన్ దేశం కుట్ర: రివ్యూ కమిషన్
Sakshi Education
భారత్‌ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి.
2020 జూన్‌లో భారత్‌కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్ ఘర్షణల్ని డ్రాగన్ దేశం చైనా పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా-చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన నివేదికను డిసెంబర్ 2న అమెరికన్ కాంగ్రెస్‌కి సమర్పించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.
చదవండి: గల్వాన్ లోయలో జూన్ 15న రాత్రి అసలేం జరిగింది?
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జూన్ 15న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ), భారత సైనికుల మధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు.

Published date : 03 Dec 2020 05:43PM