గ్లోబల్ సిటిజన్‌షిప్ అంబాసిడర్‌గా ఎంపికైన భారతీయుడు?
ప్రతిష్టాత్మక అమెరికా యూనివర్సిటీ... నార్త్ ఈస్టరన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పిరిచ్యువాలిటీ, డైలాంగ్ అండ్ సర్వీస్ నుంచి భారత ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత, మానవతావాది శ్రీశ్రీ రవిశంకర్కి గ్లోబల్ సిటిజన్‌షిప్ అంబాసిడర్‌గా గుర్తింపు లభించింది. ప్రపంచంలో మానవతా విలువలు పెంపోందించేందుకు చేసిన కృషికి గానూ ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. గ్లోబల్ సిటిజన్ షిప్ అంబాసిడర్‌గా రవిశంకర్‌ను సత్కరించినట్టు వర్సీటీ తెలిపింది.
విభేదాలకు కారణం...
రవిశంకర్ ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, కామెరూన్, కొలంబియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాక్, ఇజ్రియెల్, పాలస్తీనా, కెన్యా, కొసావో, లెబనాన్, మారిషస్, మొరాకో, నేపాల్, పాకిస్తాన్, రష్యా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అమెరికా దేశాల్లో విభేదాల శాంతియుత పరిష్కారానికీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. విభేదాలకు తొలి కారణం కమ్యూనికేషన్ దెబ్బతినడం అనీ, రెండో కారణం విశ్వాసం సన్నగిల్లడం అని ఆయన అంటారు.
వర్సిటీ గురించి...
ప్రయోగాత్మక విద్య, పరిశోధనలలో నార్త్ ఈస్టరన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పిరిచ్యువాలిటీ, డైలాంగ్ అండ్ సర్వీస్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయంగా ప్రముఖ స్థానంలో ఉంది. 100కు పైగా దేశాల విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం ఆశ్రయమిస్తోంది. అమెరికాలోని టాప్ 50 యూనివర్సిటీల్లో ఈ యూనివర్సిటీ ఒకటి. అలాగే అమెరికాలోని అత్యధిక మంది విదేశీ విద్యార్థులున్న తొలి మూడు యూనవర్సిటీల్లో ఇది ఒకటి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నార్త్ ఈస్టరన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పిరిచ్యువాలిటీ, డైలాంగ్ అండ్ సర్వీస్ నుంచి... గ్లోబల్ సిటిజన్‌షిప్ అంబాసిడర్‌గా ఎంపికైన భారతీయుడు?
ఎప్పుడు : ఫిబ్రవరి
ఎవరు : భారత ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత, మానవతావాది శ్రీశ్రీ రవిశంకర్
ఎందుకు : ప్రపంచంలో మానవతా విలువలు పెంపోందించేందుకు చేసిన కృషికి గానూ