గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో భారత్ ర్యాంకు?
Sakshi Education
2020 సంవత్సరానికిగాను ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా రూపొందించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2020లో భారత్‌కు 48వ ర్యాంకు లభించింది.
విద్యా సంస్థలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ తదితర అంశాలపై 131 దేశాల్లో అధ్యయనం చేసి జీఐఐ-2020ను రూపొందించారు. జీఐఐ-2019లో భారత్ 52 ర్యాంకును పొందగా... తాజాగా నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచింది.
జీఐఐ-2020లోని ముఖ్యాంశాలు
- జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్‌స నిలిచాయి.
- నవకల్పనలకు సంబంధించి టాప్ 50 దేశాల జాబితాలో భారత్ తొలిసారి స్థానం దక్కించుకుంది.
- నవకల్పనల్లో టాప్ దేశాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ క్రమంగా చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా దేశాల స్థానాలు మెరుగుపడుతున్నాయి.
- వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే నవకల్పనలకు సంబంధించి దిగువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
- ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సర్వీసుల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్‌లైన్ సర్వీసులు వంటి విభాగాల్లో టాప్ 15 దేశాల్లో చోటు దక్కించుకుంది.
చదవండి: సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్ లో భారత్ స్థానం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2020లో భారత్‌కు 48వ ర్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 03 Sep 2020 04:57PM