గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
Sakshi Education
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో... జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించింది.
దీంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వ్యవస్థల్లో ఈ వైరస్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని వెల్లడించారు.
హెల్త్ ఎమర్జెన్సీ...
ఒక దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనకరంగా మారిన ఆసాధారణ పరిస్థితిలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2005లో తీసుకొచ్చిన ఆంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అన్ని దేశాలు హెల్త్ ఎమర్జెన్సీపై ఖచ్చితంగా తక్షణమే స్పందించడం చట్టపరమైన విధి. ఇప్పటి వరకు ఆరు సార్లు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటన
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు : కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో

Published date : 31 Jan 2020 05:37PM