Skip to main content

గిల్గిత్-బాల్టిస్తాన్ కొత్త ముఖ్యమంత్రిగా తెహ్రీక్ నేత

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిత్- బాల్టిస్తాన్ కొత్త ముఖ్యమంత్రిగా నవంబర్ 30న తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నాయకుడు ఖాలిద్ ఖుర్షీద్ ఎన్నికయ్యారు.
Edu news

విపక్ష కూటమిలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిమ్స్ లీగ్-నవాజ్ ఉన్నాయి. 2017 ఎన్నికల చట్టం ప్రకారం గిల్గిత్ - బాల్టిస్తాన్ శాసన సభకు ఎన్నికలు జరుగుతాయని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ 2020, సెప్టెంబర్ 24న నోటిఫికేషన్ జారీ విషయం తెలిసిందే.

భారత్‌లో అంతర్భాగమే...
గిల్గిత్- బాల్టిస్తాన్ ఎన్నికలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైన్యం ఆక్రమించుకున్న గిల్గిత్- బాల్టిస్తాన్ ప్రాంతంలో ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం కూడా న్యాయపరంగా చెల్లుబాటు కాదని పేర్కొంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లతోపాటు గిల్గిత్-బాల్టిస్తాన్ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయనీ, ఎప్పటికీ ఉంటాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : గిల్గిత్- బాల్టిస్తాన్ కొత్త సీఎంగా ఎన్నిక
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నాయకుడు ఖాలిద్ ఖుర్షీద్
ఎక్కడ : గిల్గిత్- బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)

Published date : 01 Dec 2020 05:44PM

Photo Stories