గీబీ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు స్వర్ణం
Sakshi Education
ఈ సీజన్‌లోని మూడో అంతర్జాతీయ టోర్నమెంట్ గీబీ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి.
ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో మార్చి 10న ఈ టోర్ని ముగిసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు) రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. ఫైనల్లో భారత్‌కే చెందిన కవీందర్ బిష్త్ 5-0తో హుసాముద్దీన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. శివ థాపా (60 కేజీలు), గోవింద్ సాహ్ని (49 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు.
గీబీ బాక్సింగ్ టోర్నీ కంటే ముందు బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక టోర్నీలో భారత బాక్సర్లు ఏడు పతకాలు... ఇరాన్‌లో జరిగిన మక్రాన్ కప్‌లో భారత బాక్సర్లు ఆరు పతకాలు సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గీబీ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కవీందర్ బిష్త్
ఎక్కడ : హెల్సింకి, ఫిన్లాండ్

Published date : 11 Mar 2019 05:01PM