Skip to main content

గగన్‌యాన్‌ మిషన్‌కు సహకారం అందించనున్న దేశం?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తొలి మానవ సహిత ప్రయోగం (గగన్‌యాన్‌ మిషన్‌)కు ఫ్రాన్స్‌ సహకారం అందించనుంది.
Current Affairs
ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఫ్రాన్స్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ సీఎన్‌ఈఎస్‌ ఒప్పందం చేసుకున్నాయి. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం దేశానికి వచ్చిన ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ మంత్రి జీన్‌ యువేస్‌ లీ డ్రయాన్‌ చివరి రోజైన ఏప్రిల్‌ 15న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తాజ ఒప్పందం కుదిరింది.

ఒప్పందం ప్రకారం...
  • ఫ్రాన్స్‌లోని క్యాడమోస్‌ కేంద్రంలో భారత వ్యోమగాములకు, ఫ్లైట్‌ ఫిజీషియన్లకు, క్యాప్‌కామ్‌ మిషన్‌ కంట్రోల్‌ బృందాలకు శిక్షణ ఇస్తారు.
  • మైక్రోగ్రావిటీ అప్లికేషన్లు, అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధికి సీఎన్‌ఈఎస్‌ సహకరిస్తుంది.
  • ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో సీఎన్‌ఈఎస్‌ అభివృద్ధి చేసిన వ్యవస్థను భారత వ్యోమగాములు ఉపయోగించుకోవచ్చు.
  • భారత వ్యోమగాములకు ఫైర్‌ ప్రూఫ్‌ క్యారీ బ్యాగ్‌లను కూడా సీఎన్‌ఈఎస్‌ సమకూరుస్తుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఫాన్స్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ సీఎన్‌ఈఎస్‌తో ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్‌ 15
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎందుకు : గగన్‌యాన్‌ మిషన్‌కు సంబంధించి సహకారం కోసం
Published date : 17 Apr 2021 04:34PM

Photo Stories