Skip to main content

గేట్స్ ఫౌండేషన్‌తో పిరమల్ ఫౌండేషన్ ఒప్పందం

దేశంలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల్లో ఆరోగ్య, పోషక విలువల మెరుగునకు పిరమల్ ఫౌండేషన్ ‘ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ ఫర్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమం కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో పిరమల్ ఫౌండేషన్ తాజాగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల పరిధిలో 15 కోట్ల మందికి ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ ఫర్ ఇండియా కార్యక్రమం ద్వారా సేవలందించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : పిరమల్ ఫౌండేషన్
ఎందుకు : ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ ఫర్ ఇండియా కార్యక్రమం కోసం
Published date : 20 Nov 2019 04:39PM

Photo Stories