Skip to main content

గాల్లో కరోనా వ్యాప్తిపై పరిశోధన చేయనున్న భారత సంస్థ?

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు నడుం బిగించారు.
Current Affairs
ప్రస్తుతం ‘ఆసుపత్రి వాతావరణం’లో ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. వైరస్ గాలి ద్వారా ఎంత దూరం ప్రయాణించగలదు? ఎంత సమయం గాల్లో ఉండగలదు? వైరస్ బారిన పడ్డ వ్యక్తి నుంచి వెలువడ్డవి ఎంత సమయం ఉండగలవు? అన్న అంశాలన్నింటినీ ఈ పరిశోధనల ద్వారా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం సీసీఎంబీ డెరైక్టర్‌గా డాక్టర్ రాకేశ్ మిశ్రా ఉన్నారు.

కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించగలదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఓ లేఖ రాసిన నేపథ్యంలో సీసీఎంబీ పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : గాల్లో కరోనా వ్యాప్తిపై పరిశోధన చేయనున్న భారత సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)
Published date : 29 Sep 2020 05:46PM

Photo Stories