Skip to main content

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు

కాల్పుల విరమణ ప్రకటించిన దాదాపు నెల రోజులకు ఇజ్రాయెల్‌ మళ్లీ దాడులకు తెగబడింది.
Current Affairs జూన్‌ 15న గాజా స్ట్రిప్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. గాజా నుంచి ప్రయోగించిన మంటల బెలూన్లతో చాలా ప్రాంతాల్లో పంటలు నాశనమయ్యాయని, అందుకు ప్రతీకారంగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు వార్తలేమీ రాలేదు.

1967లో తూర్పు జెరూసలేంను ఆక్రమించుకున్న గుర్తుగా డమాస్కస్‌ గేట్‌ వద్ద ఇజ్రాయెల్‌ పౌరులు భారీ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా అరబ్బులు, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్‌లో బెలూన్‌ బాంబులను ప్రయోగించారు. దీనివల్ల ఇజ్రాయెల్‌లో పలు చోట్ల నిప్పంటుకుంది. 2021, మే నెలలో జెరూసలెంలోని షేక్‌ జరాలో తలెత్తిన ఉద్రిక్తతలు కారణంగా ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య 11 రోజులు భీకర పోరు సాగిన సంగతి తెలిసిందే.
Published date : 17 Jun 2021 08:58PM

Photo Stories