Skip to main content

G7 summit: అఫ్గాన్‌ పరిస్థితులపై జీ–7 కూటమి చర్చలు

యూకే, అమెరికా, జర్మనీ, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీలు సభ్యదేశాలుగా ఉన్న జీ–7 కూటమి ఆఫ్గానిస్తాన్‌ విషమిస్తున్న పరిస్థితిపై చర్చించడానికి ఆగస్టు 24న వర్చువల్‌గా సమావేశమైంది.
అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ గడువు 2021, ఆగస్టు 31న ముగిసిన తర్వాత కూడా దేశాన్ని వీడాలనుకునే వారు సురక్షితంగా వెళ్లిపోవడానికి వీలు కల్పిస్తామని తాలిబన్లు హామీ ఇవ్వాలనేది జీ–7 ‘మొదటి షరతు’గా ఈ భేటీకి అధ్యక్షత వహించిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో తాలిబన్లతో వ్యవహరించే విషయంలో ఒక రోడ్‌మ్యాప్‌ను ఆమోదించినట్లు చెప్పారు.

పుతిన్‌తో మోదీ చర్చ
రోజురోజుకూ జటిలమవుతున్న అఫ్గాన్‌ పరిస్థితిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆగస్టు 24న చర్చించారు. తాలిబన్ల రాకతో అఫ్గాన్‌లో పెచ్చరిల్లే ఉగ్రవాదం ముప్పు.. భారత్‌ వంటి దేశాలపై మరింతగా పడకుండా ఆపేందుకు, భారత్‌లోకి మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను అడ్డుకునే లక్ష్యంతో భారత్‌–రష్యాల మధ్య ప్రత్యేకంగా ‘దౌత్య వారధి’ని నిర్మించాలని అగ్రనేతలిద్దరూ నిర్ణయించారు.
Published date : 25 Aug 2021 06:57PM

Photo Stories