Farm laws: సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్ర అసెంబ్లీ?
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందిగా తమిళనాడు అసెంబ్లీ ఆగస్టు 28న తీర్మానం చేసింది.
ఉమ్మడి అంశాల్లో ఉన్న విషయంపై రాష్ట్రాల వాదన వినకుండానే కేంద్రం చట్టం చేసిందని, ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
మూడు బిల్లులు–వివరాలు
1. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు
ఈ బిల్లు ప్రకారం... రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు.

2. రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు
ఈ బిల్లు ప్రకారం... రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు.
3. నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు
ఈ బిల్లు ప్రకారం... చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి.
తెలుగు భాషా దినోత్సవం
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి జయంతి(ఆగస్టు 29)ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేట గ్రామంలో 1863, ఆగష్టు 29న గిడుగు రామమూర్తి జన్మించారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా... దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు– నార్వేలు ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా తెలుగు సంఘాలతో కలసి చేపట్టిన అంతర్జాతీయ సెమినార్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్ర అసెంబ్లీ?
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : తమిళనాడు అసెంబ్లీ
ఎందుకు : ఈ చట్టాలు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని...

Published date : 30 Aug 2021 05:59PM