ఏటీపీ ఫ్యాన్స్ ఫేవరెట్ ప్లేయర్‌గా ఎంపికైన క్రీడాకారుడు?
Sakshi Education
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)-2020 వార్షిక అవార్డుల్లో స్విట్జర్లాండ్ దిగ్గజ క్రీడాకారుడు <b>రోజర్ ఫెడరర్ ‘ఫ్యాన్స్ ఫేవరెట్ ప్లేయర్’</b>గా ఎంపికయ్యాడు.
ఫెడరర్‌కు ఈ అవార్డు రావడం వరుసగా ఇది 18వ ఏడాది. తొలిసారి ఫెడరర్‌కు 2003లో ఈ అవార్డు లభించింది. తన కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 39 ఏళ్ల ఫెడరర్ 2020, ఏడాది కేవలం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఆడి సెమీఫైనల్లో ఓడిపోయాడు. ఆ తర్వాత మోకాలి గాయం కారణం గా మరే టోర్నీలోనూ అతను ఆడలేదు.
బెస్ట్ ప్లేయర్’గా జొకోవిచ్...
ఏటీపీ 2020 ఏడాది వార్షిక అవార్డుల్లో ‘బెస్ట్ ప్లేయర్’గా నోవాక్ జొకోవిచ్ ఎంపికయ్యాడు. 13వసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన రఫెల్ నాదల్‌కు ‘ఎడ్బర్గ్ స్పోర్ట్స్‌మన్‌షిప్’ పురస్కారం లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏటీపీ-2020 వార్షిక అవార్డుల్లో ఫ్యాన్స్ ఫేవరెట్ ప్లేయర్‌గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : స్విట్జర్లాండ్ దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్

Published date : 23 Dec 2020 05:48PM