ఏటీపీ ఫైనల్స్ టోర్నీ చాంపియన్‌గా నిలిచిన రష్యా ప్లేయర్?
Sakshi Education
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో రష్యా టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ చాంపియన్‌గా అవతరించాడు.
భారత కాలమానం ప్రకారం లండన్‌లో నవంబర్ 23న జరిగిన ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ మెద్వెదేవ్ 4-6, 7-6 (7/2), 6-4తో ప్రపంచ మూడో ర్యాంకర్, 2020 ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ‘బెస్ట్ ఆఫ్ త్రీ సెట్స్’ ప్రవేశపెట్టాక సుదీర్ఘంగా సాగిన ఫైనల్ ఇదే. 2021 ఏడాది నుంచి ఇటలీలోని ట్యూరిన్‌లో ఈ మెగా టోర్నీ జరుగనుంది.
రూ. 11 కోట్లు...
టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ నెగ్గినందుకుగాను మెద్వెదేవ్‌కు 15 లక్షల 64 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 58 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్‌కు 8 లక్షల 61 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 37 లక్షలు)తోపాటు 800 ర్యాం కింగ్ పాయింట్లు దక్కాయి.
తొలి ప్లేయర్‌గా...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏటీపీ ఫైనల్స్ విజేత
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : డానిల్ మెద్వెదేవ్
ఎక్కడ : లండన్, బ్రిటన్
రూ. 11 కోట్లు...
టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ నెగ్గినందుకుగాను మెద్వెదేవ్‌కు 15 లక్షల 64 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 58 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్‌కు 8 లక్షల 61 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 37 లక్షలు)తోపాటు 800 ర్యాం కింగ్ పాయింట్లు దక్కాయి.
తొలి ప్లేయర్‌గా...
- 50 ఏళ్ల ఏటీపీ ఫైనల్స్ టోర్నీ చరిత్రలో ఏకకాలంలో ప్రపంచ నంబర్‌వన్, నంబర్-2, నంబర్-3 ఆటగాళ్లను ఓడించి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా మెద్వెదేవ్ గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలో మెద్వెదేవ్ లీగ్ దశలో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై, సెమీఫైనల్లో రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, ఫైనల్లో మూడో ర్యాంకర్ థీమ్‌పై గెలిచాడు.
- నికొలాయ్ డెవిడెంకో (2009) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన రెండో రష్యా ప్లేయర్ మెద్వెదేవ్.
- అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది కొత్త చాంపియన్ అవతరించాడు. ఈ టోర్నీలో ఇలా జరగడం ఇది రెండోసారి. మొదటిసారి 1974 నుంచి 1979 వరకు వరుసగా ఆరేళ్లు కొత్త విజేత వచ్చాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏటీపీ ఫైనల్స్ విజేత
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : డానిల్ మెద్వెదేవ్
ఎక్కడ : లండన్, బ్రిటన్
Published date : 24 Nov 2020 06:40PM